రేషన్ పంపిణీ సక్రమంగా చేయాలి – అర్బన్ మరియు రూరల్ తాసిల్దార్ శ్రీనివాసులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 05:

రూరల్ తాసిల్దార్ పది రోజుల సెలవుపై వెళ్లడంతో రూరల్ ఇంచార్జ్ తాసిల్దార్‌గా సత్య శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే పట్టణ తాసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం పట్టణంతో పాటు రూరల్ తాసిల్దార్ బాధ్యతలను కూడా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ సత్య శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణ మరియు రూరల్ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లు కార్డు దారులకు నిత్యావసర సరుకులను సక్రమంగా, పారదర్శకంగా పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రేషన్ పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా ఎక్కడైనా రేషన్ పంపిణీలో సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Scroll to Top