మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఘనంగా ‘దావత్-ఏ-ఇఫ్తార్’

నందమూరి నగర్‌, వైయస్సార్ నగర్ లోని పలు మసీదుల్లో ఇఫ్తార్ విందులు

ముఖ్య అతిథిగా హాజరై విందును ప్రారంభించిన యువనేత ఎన్ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 05:

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ సౌజన్యంతో నంద్యాల పట్టణంలో ఇఫ్తార్ విందులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం (మార్చి 5వ తేదీ) సాయంత్రం పట్టణంలోని పలు మసీదులలో ముస్లిం సోదరుల కోసం ‘దావత్-ఏ-ఇఫ్తార్’ (ఇఫ్తార్ విందు) ఏర్పాటు చేశారు.

నందమూరి నగర్, వైయస్సార్ నగర్‌లోని మస్జిద్-ఏ-ఉస్మాన్ ఘని, మస్జిద్-ఏ-నియామత్ లతో పాటు మస్జిద్-ఏ-కరీం లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదులలో ప్రార్థనలు ముగిసిన తర్వాత ఫయాజ్ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ ఈ పవిత్ర మాసంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాటికొండ బుగ్గ రాముడు, మరాఠీ సూరి , అడ్వకేట్ నందం బాబురావు , ప్రసాద్ రెడ్డి, అంజాద్ భాషా సిద్ధికి , మహేష్ స్థానిక టిడిపి నాయకులు, మసీదు కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Scroll to Top