

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 06 :
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో ఈనెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తో కలిసి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పరిశీలించారు.
ఈ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, సభ ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రజల కోసం ఏర్పాటు చేయనున్న సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, రవాణా మరియు ఇతర అవసరాలపై అధికారులు తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు
ఈ కార్యక్రమం ఇలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
