
సత్యం వార్త / నంద్యాల / మార్చి 08 :
ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కెడీసీసీ ) సీఈఓ శివలీల నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో భాగంగా సీఈఓ మంత్రి ఫరూక్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో కేడీసీసీ బ్యాంకు ద్వారా రైతులకు, ఖాతాదారులకు అందుతున్న సేవలను, బ్యాంక్ ప్రగతిని మంత్రి ఫరూక్ కి వివరించారు. సహకార రంగం బలోపేతానికి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా బ్యాంక్ కార్యకలాపాలు సాగాలని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ సూచించారు . ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
