శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల లో “కెమరూన్-2కె 26, జాతీయ స్థాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సు  ముగింపు కార్యక్రమం

విద్యార్థులు మొబైల్ ఫోన్లను వినోదానికి కాకుండా…ఆన్లైన్ క్లాసులు విని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి  –  శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మెన్, ప్రాపెసర్ డాక్టర్ జి.రామకృష్ణా రెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 08 :

విద్యార్థులు మొబైల్ ఫోన్లు ను వినోదానికి కాకుండా,ఆన్ లైన్ క్లాసులు విని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మెన్,ప్రాపెసర్ డాక్టర్ జి.రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (అటానమస్) వేదికగా నిర్వహించిన *“కెమరూన్-2కె 26 అను పేరున నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సు  ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి *కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి  ముఖ్య అతిథిగా విచ్చేయగా, డా. యు.వి.ఎస్. కుమార్ , ప్రోగ్రామ్ కన్వీనర్ శ్రీ ఎస్. వెంకట్రావు  అధ్యాపకులు ప్రత్యూష,  దివ్యలత, సుష్మా, రహిమూన్, మాధవ రెడ్డి  ఇతర కళాశాలల ప్రతినిధులుగా,  విశ్వనాథ్ రజినీ కిరణ్మయి , కుమార్  శమీఉల్లా  హాజరయ్యారు. వీరితో పాటు వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి  మాట్లాడుతూ, “కార్యక్రమాల నిర్వహణపై విద్యార్థుల నుంచి వచ్చే స్పందన  మాకు ఎంతో కీలకం. నేటి విద్యా విధానంలో వస్తున్న మార్పులను గమనించి, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా ఐఐటి  వంటి ప్రతిష్టాత్మక సంస్థల సర్టిఫికేషన్లకు మంచి విలువ ఉంటుంది. విద్యార్థులు మొబైల్ ఫోన్లను కేవలం వినోదానికే కాకుండా, ఆన్‌లైన్ క్లాసులు విని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి” అని సూచించారు. విద్యార్థులారా, ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే కేవలం నిర్వాహకుల కృషి మాత్రమే సరిపోదు, అందులో పాల్గొనే మీ స్పందన చాలా ముఖ్యం. మేము ఎప్పుడూ వేదికపై నుంచి మాట్లాడుతూనే ఉంటాము, కానీ ఈ రోజు మీ మాట వినాలనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్‌లో మీకు నచ్చినవి ఏమిటి? ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అనేది మాకు తెలియజేయండి.  మీ అధ్యాపకులు చదువుకునే రోజులకు, నేటి తరం విద్యార్థులు చదువుతున్న రోజులకు మధ్య చాలా మార్పు వచ్చింది. నేడు అవకాశాలు మీ ముంగిట ఉన్నాయి. ముఖ్యంగా ‘మొబైల్ ఫోన్’ అనేది కేవలం కాలక్షేపానికి మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన విద్యా పరికరం. ఐఐటి  వంటి సంస్థలు అందించే ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసి, ధృవపత్రాలు  సాధించండి. అటువంటి సర్టిఫికెట్లకు సమాజంలో, ఉద్యోగ విపణిలో చాలా విలువ ఉంటుంది. మీ బంగారు భవిష్యత్తుకు ఇవే పునాదులు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో మీరు ఇలాగే ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను.”

*కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి Dr. యూ.వి.ఎస్. కుమార్  మాట్లాడుతూ

“నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కేవలం చదువు మాత్రమే సరిపోదు, ‘నిర్ణయం తీసుకునే శక్తి”వ్యక్తిగత నైపుణ్యాలు’ చాలా అవసరం. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ‘పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి’. నేడు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను మీకు అనుకూలంగా మలచుకోండి. క్రమశిక్షణతో కూడిన హార్డ్ వర్క్ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అని తెలిపారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకోవాలని తెలిపారు. “పెద్ద కలలు కనండి, వాటిని సాధించడానికి కష్టపడండి” అని ఆయన పిలుపునిచ్చారు.

ఇతర కళాశాలల నుండి ప్రతినిథిగా వచ్చిన అధ్యాపకులు  విశ్వనాథ్  మాట్లాడుతూ* ఈ కళాశాలతో మాకు విడదీయలేని అనుబంధం ఉంది. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇక్కడ నిర్వహించిన ఎన్నో పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాము. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేము. మమ్మల్ని ఆహ్వానించిన చైర్మన్ గారికి కృతజ్ఞతలు. విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడానికి ఇటువంటి వేదికలు నిరంతరం కొనసాగాలి అని తెలిపారు.

*అధ్యాపకులు  రజనీ కిరణ్మయి   మాట్లాడుతూ,

“నేడు ఇక్కడ ఇంతమంది ఉత్సాహవంతులైన విద్యార్థులను చూడటం చాలా సంతోషంగా ఉంది. మా విద్యార్థులు సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, అద్భుత ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. అదే ఉత్సాహంతో ఈ రోజు కూడా ‘కెమరూన్-2K26’ లో పాల్గొనడం మాకు గర్వకారణంగా ఉంది. విద్యార్థులకు ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్న యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను అని తెలిపారు.

అధ్యాపకులు  కిరణ్, షమీఉల్లా  మాట్లాడుతూ

“శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎప్పుడూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. మేము అనేకసార్లు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నిర్వహించిన పోటీలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి అని తెలిపారు.

కార్యక్రమం విద్యార్థులు ప్రతిస్పందిస్తూ …. “ఇటువంటి కార్యక్రమాలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. పుస్తకాలకే పరిమితం కాకుండా, మాలో ఉన్న సృజనాత్మకతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఈ పోటీలలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:

1. టెక్నికల్ క్విజ్

ప్రథమ బహుమతి: ఎం. లక్ష్మీ సౌమ్య, ఎస్. అల్లిపిషా, కె. ఆకాంక్ష (బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల).

ద్వితీయ బహుమతి: కె. ఈశ్వర్, ఎస్. అబ్దుల్ అజీజ్, బి. సాయి శ్రీనివాస్ (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

తృతీయ బహుమతి: బి. ప్రణీత, ఈ. శ్రీనిత్య, ఎస్. మమత (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

2. కోడ్ క్వెస్ట్ – ప్రోగ్రామ్మింగ్ కాంపిటీషన్

ప్రథమ బహుమతి: జయలక్ష్మి, భవ్యశ్రీ, సంధ్యారాణి (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

ద్వితీయ బహుమతి: షాహిన, నందిని (బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల).

తృతీయ బహుమతి: ఫరూక్, అజ్మత్ హుస్సేన్, సయ్యద్ అబ్దుల్ ముఖేత్ పీర్ (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

3. పేపర్ ప్రజెంటేషన్

ప్రథమ బహుమతి: లిఖిత రెడ్డి, సుమయ్య (సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల).

ద్వితీయ బహుమతి: మాధురి, లిఖిత (బసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల).

తృతీయ బహుమతి: దీపిక (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

4. సాంస్కృతిక పోటీలు

గానం : ప్రథమ బహుమతి – బి. సాయి శ్రీనివాస్ (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

నృత్యం

ప్రథమ బహుమతి: ఎ. ప్రదీప్ కుమార్ (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

ద్వితీయ బహుమతి: ఎస్. ఇందుశ్రీ సుమతి (సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల).

విజేతలకు జ్ఞాపికలు , ధ్రువపత్రాలు ముఖ్య అతిధి చేతుల మీదుగా అందజేయబడిన తరువాత, కళాశాల సంప్రదాయం ప్రకారం, కార్యక్రమం యొక్క కన్వీనర్, కో-కన్వీనర్లను, కళాశాల  చైర్మన్ మరియు విద్యార్థులు జ్ఞాపికలు తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్  డిపార్ట్మెంట్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు. చివరగా జాతీయగీతాలాపన తో కార్యక్రమం ముగిసింది.

Scroll to Top