




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 21 :
ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో పవిత్ర రంజాన్ నెలను విజయవంతంగా ముగించుకోవడం ఎంతో ఆనందదాయకం. ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, జకాత్ ద్వారా అవసరంలో ఉన్న సాటి వారిని ఆదుకోవడం ముస్లిం సమాజంలోని మానవత్వానికి గొప్ప నిదర్శనం. అల్లాహ్ కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ… నంద్యాల భీమవరం రోడ్డులోని ఆల్పూర్ ఖాన్ ఈద్గాహ్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
