
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 21 :
నంద్యాల జిల్లాలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి, డోన్ నియోజకవర్గ పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి గాయపడిన నేపథ్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. ఇటీవల దేశం సుధాకర్ రెడ్డి బైక్పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురై గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న శిల్పా మోహన్ రెడ్డి నేడు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
