సాంబవరం అంకాలమ్మ తిరునాళ్లలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన – భూమా బ్రహ్మానందరెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 21 :
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో అంకాలమ్మ తిరునాళ్ల సందర్భంగా ఘనంగా ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ వాల్మీకి సంఘం నాయకులు మరియు గ్రామ పెద్దలు సోమ మద్దిలేటి రెడ్డి, శిరన్న ఆదినారాయణ ఆహ్వానం మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ ఎద్దుల పోటీలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. గ్రామంలో ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో యువతతో పాటు పెద్దలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో రాంపల్లె రామిరెడ్డి, వెన్నపూస విశ్వేశ్వరరెడ్డి, మంచాల భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి, జయసింహారెడ్డి, తిమ్మారెడ్డి, వెంకట నాయుడు, వెంకటేశ్వర్లు, మధు బాబు, నరసింహ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, అంకాలమ్మ తిరునాళ్లు గ్రామ సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమం శాంతియుతంగా, ఉత్సాహంగా కొనసాగింది.

Scroll to Top