మున్సిపాలిటీలో అమరావతి సంబరాలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 02  :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆశయాలకు న్యాయం చేయడమే కాకుండా, భవిష్యత్ అభివృద్ధికి దారితీసే కీలక ఘట్టంగా విశ్లేషిస్తున్నారు.

ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. కార్యాలయం ముందు రంగురంగుల ముగ్గులు వేసి సిబ్బంది ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అమరావతి నిర్ణయాన్ని హర్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, మెప్మా పీడీ వెంకటదాస్, ఎంఈ గురప్ప యాదవ్, డీఈలు నాగభూషణ్ రెడ్డి, పవన్ కుమార్, రసూల్, రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్. శభరిష్. శానిటేషన్ సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  ఈ సంబరాలు నగరంలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి.

Scroll to Top