మున్సిపాలిటీలలో పారిశుధ్యం మెరుగుపరచాలి

అన్న క్యాంటీన్లను పటిష్టంగా నిర్వహించాలి

జిల్లాలో గంజాయి మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించాలి

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 22 :
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.
గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయ్ ఆనంద్ ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పారిశుద్ధ్య, అన్న క్యాంటీన్ల నిర్వహణ, సంక్షేమ వసతి గృహాలు నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్య నిర్వహణలో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. మరియు అన్న క్యాంటీన్లను పటిష్టంగా నిర్వహించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రుచికరమైన నాణ్యమైన భోజనం ప్రజలకు ఇచ్చేటట్లు చూడాలన్నారు. అన్నా క్యాంటీన్లలో ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలన్నారు.
జిల్లాలో యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా గంజాయి మాదగదరవ్యాలను పూర్తిగా నివారించాలన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను నియంత్రించేందుకు పోలీసులతో పాటు సంబంధిత శాఖల అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడైతే మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయో ఆయా ప్రదేశాలను గుర్తించి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top