నాలుగు రోజులు బ్యాంకులు బంద్

వరుస సెలవులు, సమ్మెతో సేవలకు అంతరాయం

సత్యం వార్త / నంద్యాల / జనవరి 22 :
బ్యాంకింగ్ సేవలు వినియోగించే ప్రజలకు కీలక సమాచారం. ఈ నెల జనవరి 24 నుంచి 27 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవులు మరియు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
జనవరి 24న నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు అధికారిక సెలవులు ఉన్నాయి. ఇదే సమయంలో జనవరి 27న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు. వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో నాలుగు రోజులపాటు చెక్కుల క్లియరెన్స్, నగదు లావాదేవీలు, కౌంటర్ సేవలు నిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ సెలవుల సమయంలో ఏటీఎం సేవలు, డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలకు అంతరాయం ఉండదని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. ప్రజలు అత్యవసర బ్యాంక్ పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు

Scroll to Top