
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 12:
మహిళలు సమాజ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, మహిళా శక్తి దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
గురువారం న్యూ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలో ఉన్న జైపూర్ లోక్సభ సభ్యురాలు మంజుశర్మ నివాసంలో నిర్వహించిన రాష్ట్ర సేవికా సమితి మహిళాశాఖ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర సేవికా సమితి మహిళలతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో ఉన్న పాత్రను ప్రశంసిస్తూ, మహిళా శక్తి దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమన్నారు. మహిళా చైతన్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. రాష్ట్ర సేవికా సమితి మహిళా శాఖ కార్యక్రంలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఢిల్లీలో నిర్వాహకులకు అభినందించారు.
