

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 12 :
నబి నగర్ లోని రాయల్ పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా ఈద్ కిట్ల పంపిణీ నంద్యాల పట్టణం నడిగడ్డ లోని రాయల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధ్యక్షులు వి ఖాజా హుస్సేన్ మరియు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ యాకుబ్ కరస్పాండెంట్ ఇషాక్ వలి ఆధ్వర్యంలో ఈద్ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జమాతుల్ ఉలుమా వల్ అయిమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు అబ్దుల్ హాది హాజరత్ మరియు నవభారత్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్ఎండి హుస్సేన్ పాల్గొనడం జరిగింది పాఠశాల డైరెక్టర్ యాకూబ్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా మెరుగుపడినటువంటి వారందరూ వారు సంపాదనలో 2.5%జకాత్ రూపంలో తీసి నిరుపేదలకు తోడ్పాటు అందించుట అల్లా యొక్క ఆదేశం మేరకు మేము కూడా రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫునుంచి దాదాపుగా 14 ఏళ్ల నుంచి రంజాన్ తోఫా అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 50 మంది తో మొదలుపెట్టి దాదాపు 500 మంది పేదలకు నిరుపేదలకి మరియు అవసరార్థులకు రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ తోఫ ఇవ్వడం జరుగుతుంది ఈ రంజాన్ తోఫాలో దాదాపుగా 13 రకాల వస్తువులను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి అయినటువంటి హజ్రత్ అబ్దుల్ హాది మాట్లాడుతూ డాక్టర్ యాకుబ్ మరియు ఇషాక్ వలి దాదాపుగా 16 సంవత్సరాల నుండి ఈ యొక్క రంజాన్ తోఫా పేద ప్రజలకు ఇచ్చి వారు కూడా అందరితో సమానంగా రంజాన్ పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ కిట్లని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది నవ భారత్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్ఎండి హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో నుంచి రెండున్నర పర్సెంట్ జకాత్ రూపంలో తీసి పేద ప్రజలకు పంచినట్లయితే వారు కూడా సంతోషంగా ఈ యొక్క ఈ రంజాన్ పండుగ నిర్వహించుకుంటారని ఈ విధంగా చేయడం ద్వారా అల్లా యొక్క కృపా వల్ల మనం ఇతరులకు ఉపయోగపడినట్టు అవుతుందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో తాహేరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మెంబర్ వి యూసుఫ్ షరీఫ్ మౌలానా సాయి వాణి స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ బాషా మరియు రాయల్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు జరిగింది.
