రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ వాష్ అండ్ గో’ తనిఖీలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 12 :
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు నంద్యాల పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనాలపై ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
కడప–నంద్యాల హైవే, కర్నూలు–విజయవాడ మార్గం, నంద్యాల–కర్నూలు ఎన్హెచ్-44 హైవే, కర్నూలు–బెంగుళూరు మార్గాల్లో అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు వాహనాలను ఆపి తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ మరియు ట్రావెలింగ్ బస్సులలో భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.
వాహనాల దస్తావేజులు, డ్రైవింగ్ లైసెన్సులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తూ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అధిక వేగం, రాంగ్ రూట్ ప్రయాణం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని నంద్యాల జిల్లా పోలీసులు తెలిపారు.

Scroll to Top