బైర్లూటి ముర్తుజావలి దర్గాలో ఎంపీ ప్రత్యేక ప్రార్థనలు, చాదర్ సమర్పణ
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్. షబానా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 18 :
కులాలు, మతాల కంటే మానవత్వమే మిన్న అని, అందరినీ సమానంగా గౌరవించడమే నిజమైన ప్రజాస్వామ్యమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మరోసారి చాటిచెప్పారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, శ్రీశైలం బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి మోమిన్ షభానా అన్నారు. బుధవారం ఆత్మకూరు బిజెపి అసెంబ్లీ కార్యాలయంలో షభానా మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైల పుణ్య క్షేత్రంకు నల్లమల అరణ్యంలో కాలినడకన వెళ్తుతున్న సందర్బంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాదయాత్రకు సంఘీభావం తెలిపాం అన్నారు.
ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధిగాంచిన బైర్లూటి ముర్తుజావలి దర్గాను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రతి ఏటా కాలినడకన అరణ్యం గుండా వెళ్లుతూ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అత్యంత భక్తిశ్రద్ధలతో చాదర్ సమర్పించడం ప్రత్యేకం అన్నారు. శ్రీశైల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని బీజేపీ నాయకురాలు షబానా ఆకాంక్షించారు.
ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మతసామరస్యానికి నిలువుటద్దం అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా కొనియాడారు. హిందూ పండుగైన శివరాత్రి వేళ శ్రీశైల మల్లికార్జునుడి దర్శనానికి వెళ్తూ, మార్గమధ్యలో ఉన్న దర్గాను సందర్శించడం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విశాల హృదయానికి నిదర్శనమన్నారు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేవలం ఒక వర్గానికో, కులానికో పరిమితమైన నాయకురాలు కాదని. హిందూ, ముస్లిం, క్రైస్తవ.. ఇలా అందరినీ తన కుటుంబ సభ్యుల్లా భావించే గొప్ప సంస్కారం ఆమెదని, రాజకీయాలకు అతీతంగా, మతాల మధ్య దూరాన్ని తగ్గించి అందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంపీ శబరి సాగిస్తున్న ఈ పర్యటన నియోజకవర్గంలో ఐక్యతకు కొత్త అర్థాన్ని ఇస్తోందని. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ప్రతి దైవ ప్రార్థనలోనూ ప్రజా క్షేమాన్ని కోరుకునే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మతసామరస్యానికి నిలువుటద్దంలా నిలుస్తున్నారని బీజేపీ నాయకురాలు మోమిన్ షబానా అన్నారు. ఒకవైపు నల్లమల అరణ్యం శివనామ స్మరణతో శ్రీశైల యాత్ర చేస్తూనే, మరోవైపు దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన ఎంపీ శబరి తీరుపై స్థానిక ముస్లిం పెద్దలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు స్వస్తి పలికి, ఇటువంటి సామరస్య ధోరణి కలిగిన నాయకురాలు తమ ఎంపీగా ఉండటం గర్వకారణమని ముస్లిం మత పెద్దలు, బీజేపీ నాయకురాలు మోమిన్ షబానా పేర్కొన్నారు.
