
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 18 :
నంద్యాల పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఎమ్ ఈ గురప్పయాదవ్. ఇంజనీర్, డీఈ రసూల్ , ఏఈలతో కలిసి టిడ్కో గృహాల వద్ద ఉన్న నందమూరి నగర్, వైఎస్సార్ నగర్ బరియల్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. బరియల్ గ్రౌండ్ ప్రాంతంలో ముల్లు చెట్లు, పొదలు పూర్తిగా తొలగించి పరిశుభ్రత పాటించాలన్నారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమయపాలనతో పనులు పూర్తిచేయాలని సూచించారు. అలాగే నందమూరి నగర్ మున్సిపల్ స్కూల్‌లో జరుగుతున్న గ్రావెల్ ఫిల్లింగ్ పనులను పరిశీలించి, విద్యార్థులకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాల ప్రాంగణం సక్రమంగా ఉండేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన సీసీ డ్రెయిన్స్ పనులను కూడా పరిశీలించి, సాంకేతిక ప్రమాణాలు పాటిస్తూ డ్రెయినేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. పట్టణ అభివృద్ధి పనుల్లో నాణ్యతపై రాజీ ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు.
