మంత్రి నారా లోకేష్  ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ , ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త  / ఫిబ్రవరి 25:
నారా లోకేష్ రాష్ట్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నంద్యాల పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం మరియు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో నంద్యాల పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగాయి

Scroll to Top