వక్తల శిక్షణకు తప్పనిసరి హాజరు – బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 25:
నంద్యాల జిల్లా బిజెపి తరఫున వక్తలుగా నియమితులైన 50 మంది నాయకులు మరియు జిల్లా శిక్షణ కన్వీనర్లు తప్పనిసరిగా శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని నంద్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు స్పష్టం చేశారు.  పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా జరిగే శిక్షణల్లో వక్తలుగా పాల్గొనాల్సిన వారికి ప్రత్యేక సన్నాహక శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో ఎలా సిద్ధం కావాలి, ఏ అంశాలపై మాట్లాడాలి వంటి విషయాలపై మార్గదర్శనం అందించనున్నట్లు చెప్పారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లా బిజెపి కార్యాలయంలో కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని వక్తలు, శిక్షణ కన్వీనర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అలాగే జిల్లా శిక్షణ కన్వీనర్లు, కో-కన్వీనర్లు తమకు కేటాయించిన అసెంబ్లీ పరిధిలోని వక్తలకు వెంటనే సమాచారం అందించి, వారిని శిక్షణ సన్నాహక సమావేశానికి హాజరు చేయాలని సూచించారు.

Scroll to Top