భీమవరంలో శనగ పంట కోత ప్రయోగాలు

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 17 :

నంద్యాల మండలం భీమవరం గ్రామంలో యూనిట్ నెంబర్ 61లో మంగళవారం శనగ పంటకు కోత ప్రయోగాలు నిర్వహించారు. సీనియర్ గణాంక అధికారి సతీష్ బాబు పర్యవేక్షణలో మొత్తం మూడు ప్రయోగాలు చేపట్టారు. 5×5 విస్తీర్ణంలో మొదటి ప్రయోగంలో 5.150 కేజీలు, రెండవ ప్రయోగంలో 5.200 కేజీలు, మూడవ ప్రయోగంలో 5.050 కేజీలు దిగుబడి నమోదైంది. ఎకరాకు సుమారు 8–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా శనగ పంటకు బీమా అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓ మహేష్, వీఏఏ లలిత, రైతులు కైప నరేంద్ర రెడ్డి, మహమ్మద్ రఫీ, లింగమయ్య, చిన్న హుసేని, తలారి నరసింహులు పాల్గొన్నారు.

Scroll to Top