శివనామస్మరణతో మారుమోగిన క్షేత్రం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
పాల్గొన్న టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 17 :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన శ్రీ మహానందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవార్ల రథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు. ఆలయ మర్యాదలతో స్వాగతం అందుకున్న అనంతరం ఆయన రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ లోక కల్యాణం కోసం జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు . పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.. మహానంది సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరియు దాతలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మహాదేవుడిని ప్రార్థించామన్నారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. రథాన్ని లాగుతున్న సమయంలో భక్తులు చేసిన “ఓం నమఃశివాయ” నామస్మరణతో మహానంది క్షేత్రం మారుమోగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పొరుగు జిల్లాల నుండి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, నేరెళ్ల అశోక్, బింగుమళ్ల శ్యాంసుందర్ గుప్తా, వినయ్, గంగిశెట్టి రాజేష్, గంగిశెట్టి మల్లికార్జున, సురేష్, చలం బాబు, వరప్రసాద్, బుగ్గ రాముడు, దీపక్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, మిద్దె ఉసేని , ఉప్పరి సురేష్ కుమార్, నాగరాజు, జయ కృష్ణ , జైలాన్, మహేష్ మరియు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
