




సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17 :
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలనుసారంగా స్పోర్ట్స్ క్యాలెండర్ లో భాగంగా ఈనెల ఫిబ్రవరి 17వ తేదీన జిల్లాస్థాయి చెస్ శాప్ లీగ్ 2026 పోటీలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం, నంద్యాలలో ప్రారంభించడం జరిగింది. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శాప్ లీగ్- 2026 క్రీడా పోటీలు నంద్యాల జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అదేవిధంగా ఈ పోటీలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని వారిలో ఉండే ప్రతిభను గుర్తించి రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ శిక్షకులచే వాళ్లకు శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే విధంగా తీర్చిదిద్దాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన మూడు శాతం క్రీడా కోటాను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షిచారు. శాప్ లీగ్ చెస్ జిల్లా స్థాయి పోటీలలో వందమంది క్రీడాకారులు, క్రీడాకారిణిలు క్రీడా యాప్ లో రిజిస్టర్ చేసుకుని ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. జిల్లాస్థాయి చెస్ లీగ్ పోటీలకు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం. ఎన్. వి. రాజు, శిక్షకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
