బి-మ్యాట్ మెడికల్ ఒలింపియాడ్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మెరిసిన శ్రీ శాంతినికేతన్ విద్యార్థులు

కష్టపడే విద్యార్థులకు విజయం లభిస్తుంది

లక్షం పెట్టుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎవ్వరూ ఆపలేరు

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 16:

కష్టపడే విద్యార్థులకు విజయం ఖచ్చితంగా లభిస్తుందని,లక్షం పెట్టుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాన్ని ఎవరూ ఆపలేరని శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మెన్ సుధాకర్ పేర్కొన్నారు.

నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌లో ఉన్న శ్రీ శాంతినికేతన్ స్కూల్ విద్యార్థులు బి-మ్యాట్  మెడికల్ ఒలింపియాడ్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచారు. ఈ పోటీ పరీక్షలో ఎనిమిదో తరగతి విద్యార్థి జె.సి. సంతోష్ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, ఆరవ తరగతి విద్యార్థి మాబాషా రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ సుధాకర్ మాట్లాడుతూ విజేత విద్యార్థులను మెమెంటోలు, షీల్డ్స్ , ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థుల కృషిని ఆయన ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

“కష్టపడి చదివే విద్యార్థులకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్యాన్ని పెట్టుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎవ్వరూ ఆపలేరు” అని విద్యార్థులను ప్రోత్సహించారు.

అలాగే ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఐఐటీ సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

విద్యార్థుల విజయానికి నిరంతరం మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Scroll to Top