
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మే 02 :
పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా ఉంటుందని, సీఎం చంద్రబాబు నాయుడు కూడా పేద రోగులను దృష్టిలో పెట్టుకొని సీఎం రిలీఫ్ కు ఎంపీ గా తాను సిఫారసు చేయగానే అవసరమైన నిధులు విడుదల చేయడం అభినందనీయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల బొమ్మలసత్రం లోని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు.
నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బోరెడ్డి వెంకట కృష్ణారెడ్డి కి రూ.1,51,616 లు,
నంద్యాల ఎస్ బి ఐ కాలనీకి చెందిన శివశంకవ రెడ్డికి రూ.132,620 లు
నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన ఎస్. మహబూబ్ బాషా కు రూ. 35,900 లు, గోస్పాడు మండలం దీబగుంట్ల కు చెందిన వై. ఓబులేసుకు రూ. 35914 లు,
ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం, ఎరగుడిదిన్నె గ్రామానికి చెందిన ఎన్. తిక్క నవసమ్మ కు రూ. 42000 లు, కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన ఎం. ననాగ లింగమ్మ కు రూ. 32,324 లు, నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన సయ్యద్ షాహిదాకు రూ. 30514 లు, దొర్నిపాడు గ్రామానికి చెందిన సి.ఈశ్వరమ్మ కు రూ.143490 లు, నంద్యాల నీలివీధికి చెందిన నాగ లక్ష్మమ్మ కు రూ.60,000 లు, కర్నూలు శారదా నగర్ కు చెందిన జి. నార్దిని కి రూ.40810 ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు. మా వినతిని మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు వెంటనే విడుదల చేసినందుకు, నిధుల విడుదలకు కృషి చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి భాధితులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి తదితర టీడీపీ నాయకులు ఉన్నారు.
