పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 75 ఫిర్యాదులు  –  జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్

విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 16 :

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)  కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఫిర్యాదిదారుల నుంచి 75 ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి  ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 ఫిర్యాదులలో కొన్ని….

1).బనగానపల్లె గ్రామానికి చెందిన గోపాల్ అను వ్యక్తి బియ్యం వ్యాపారం చేస్తున్నానని నన్ను నమ్మించి బియ్యం బస్తాలు తీసుకొని వెళ్లి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు నాకు న్యాయం చేయండని వెలుగోడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

2).నాకు సంబంధించిన రెండు ఎకరాల పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించి పొలం దగ్గరికి వస్తే చంపుతానని మహాపతిరావు,రమేష్ ,యశోద ,అనువారు బెదిరిస్తున్నారని నాకు న్యాయం చేయండని  కరివేన గ్రామానికి చెందిన జయమ్మ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

3).నా ఇంటిని నరేష్ అనే వ్యక్తికి బాడుగకు ఇవ్వడం జరిగింది.11 నెలలుగా  బాడుగ ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని న్యాయం చేయండని బిలకలగూడూరు గ్రామానికి చెందిన సుధాకర్ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు

4).అయ్యలూరుమెట్ట నందు నూతనంగా నిర్మించుచున్న హెబ్రోన్ ప్రేయర్ హౌస్ ప్రార్థన మందిరం నందు సుమారు 1,20,000/- విలువచేసే కరెంటు వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుని పోయినారని  న్యాయం చేయండని పాస్టర్ ప్రసన్నకుమార్ గారు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

Scroll to Top