పూసులూరు గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 09 :

నంద్యాల మండలం పూసులూరు గ్రామంలోని కోదండరామాలయం వద్ద నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ భూమి పూజలో పాల్గొని  రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయన్నారు. నంద్యాల మండలం పరిధిలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు.  అదే విధంగా పూసులూరు గ్రామంలో నూతన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా మారిందనీ, కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో పూసులూరు గ్రామ టీడీపీ నాయకులు రాం గోపాల్ రెడ్డి, రాం కృష్ణ రెడ్డి, సీతారాం రెడ్డి, రవీంద్ర రెడ్డి, ప్రసాద్ రెడ్డి, విజేయుడు, శేఖర్, వెంకటేశ్వర్లు తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Scroll to Top