
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 09 :
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకాని గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన 71 ఎకరాల 57 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రంగా ఖండించి, నంద్యాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు మాట్లాడుతూ..గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో గుంటూరు అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన 71 ఎకరాల 57 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవడం పూర్తిగా అన్యాయమని తీవ్రంగా ఖండించారు. ఈ తరహా చర్యలు కొనసాగితే రాబోయే రోజుల్లో వక్ఫ్ భూములు, క్రిస్టియన్ మైనారిటీలకు చెందిన స్థలాలు, ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్యాయ స్వాధీనాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటామని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ధీమాగా ప్రకటించారు. ప్రజల విశ్వాసాన్ని మోసం చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మబున్నిసా, వైయెస్సార్‌సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, జిల్లా వైఎస్సార్‌సీపీ మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్, వైయెస్సార్‌సీపీ నాయకులు గన్నీ కరీం, వైయెస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఆరిఫ్, కలాం, బాసిద్, వైయెస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
