డొమెస్టిక్ గ్యాస్ బ్లాకులో 2 వేలు
చిరువ్యపారులపై గ్యాస్ ధరల ఎఫెక్ట్
గ్యాస్ ఏజెన్సీల నిర్వాహమా,డెలివరీ బాయ్స్ నిర్వాహమా
అధికారులు దాడులు చేయకుండా సైలెంట్ కు కారణం ఏంటి
యుద్ధం ఎఫెక్ట్ బూచితో…నిలువుదోపిడీ చేస్తున్న గ్యాస్ నిర్వాహకులు
6 గ్యాస్ ఏజెన్సీల నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్ లు కొన్ని అధిక ధరలకు విక్రయాలు
గ్యాస్ ధరలతో వ్యాపారాలు చేయలేమంటున్న చిరు వ్యాపారులు
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 11 :
ఇజ్రాయిల్,ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గ్యాస్ వినియోగదారులపై భారీ ఎఫెక్ట్ పడింది.ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ 21 రోజులకు పెంచడం,యుద్ధం కారణంగా గ్యాస్ సరైన రీతిలో సరఫరా కాకపోవడం గ్యాస్ ఏజెన్సీల కు కల్పవృక్షంగా మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.నంద్యాలలో గత మూడు రోజులుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ చిరు వ్యాపారుల కు దొరకాలంటే 2 వేలు పెట్టీ కొనాల్సిన పరిస్థితి ఎదురైంది.చిరు వ్యాపారులు బజ్జీలు,టిఫిన్ సెంటర్లు,టీ హోటల్స్ వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్లు వాడకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు యదేచ్ఛగా వాడుతున్న అధికారులు పట్టించుకోకపోవడం నాణ్యానికి ఒక వైపు.గ్యాస్ ఇబ్బందులు లేని సమయంలో సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరు చిన్నా,పెద్ద వ్యాపారస్తులు తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ మాత్రమే ఉపయోగించాలి.వ్యాపారస్తులు కమర్షియల్ గ్యాస్ ఉపయోగించకుండా డొమెస్టిక్ గ్యాస్ బహిరంగంగా వినియోగిస్తున్న అధికారులకు నెల,నెల మామూళ్లు ముట్టడంతో చూసి,చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్యాస్ ఏజెన్సీల నిర్వాహమా,గ్యాస్ డెలివరీ బాయ్స్ నిర్వాహమా అనేది తేల్చాల్సివుంది.అధికారులు ఎలాంటి చర్యలు లేకపోవడంతో డొమెస్టిక్ గ్యాస్ ప్రస్తుతం మార్కెట్లో 2 వేలు పెడితే కానీ దొరకని పరిస్థితి నెలకొంది.కమర్షియల్ గ్యాస్ ధర అధికంగా ఉండడంతో చిరు వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ నే ఉపయోగిస్తున్నారు.వివరాల్లోకి వెళితే ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం గత పదిరోజులుగా జరుగుతున్న విషయం విదితమే.యుద్ధం కారణంగా గ్యాస్ సమస్య అన్ని ప్రాంతాల్లో మొదలైంది.కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్,డొమెస్టిక్ గ్యాస్ దొరకకపోవడతో కొన్ని వ్యాపార సంస్థలు మూసివేసే దిశగా ఉన్నారు.మరికొన్ని ప్రాంతాల్లో గ్యాస్ కంపెనీల వద్ద గ్యాస్ కోసం వినియోగదారులు ఘర్షణ పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే నంద్యాల అంటేనే ఏదైనా చరిత్ర సృష్టించడం నంద్యాల కు గొప్ప పేరు ఉంది.యుద్ధం గ్యాస్ యజమానులకు కల్పతరువుగా మారిపోయింది.గతంలో చిన్న,చిన్న వ్యాపారస్తులు కమర్షియల్ గ్యాస్ ధర అధికం కావడం,డొమెస్టిక్ గ్యాస్ దొరకడంతో చిన్న,చిన్న వ్యాపారులు కమర్షియల్ గ్యాస్ ను ఉపయోగించకుండా డొమెస్టిక్ గ్యాస్ నే ఉపయోగిస్తున్నారు.అటు ఏజెన్సీలనుంచి,ఇటు వ్యాపారుల నుంచి సంబంధిత అధికారులకు నెల,నెల మామూళ్లు ఇస్తుండటంతో దాడులు,తనికీలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నంద్యాలలో దాదాపు 6 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి.వేళల్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.సాధారణ పరిస్థితుల్లో గ్యాస్ చిరు వ్యాపారులకు 100 నుంచి 150 రూపాయలకు అధిక ధరలకు విక్రయించేవారు.గ్యాస్ ఏజెన్సీల యజమానులకు తెలిసో, తెలియకో గ్యాస్ బాయ్స్ టీ హోటల్స్,చిరు వ్యాపారుస్తులకు విక్రయించారు.డొమెస్టిక్ గ్యాస్ ఉపయోగించకూడదని తెలిసిన అధికారులు పట్టించుకోకపోవడంతో వాటినే బహిరంగంగానే వాడుతున్నారు.ఈ నేపధ్యంలో యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ ల కొరత అధికం కావడం,ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ 21 రోజులకు చేయడంతో ఒక వైపు గ్యాస్ రాక,బుకింగ్ దూరం పెరిగిపోవడంతో సమస్య ఉండదని వినియోగదారులు కొందరు గ్యాస్ బుకింగ్ చేసుకోకపోవడతో సమస్య మొదలైంది.వినియోగదారులు,వ్యాపారస్తుల అవసరాలను క్యాష్ చేసుకునేందుకు కొందరు గ్యాస్ డెలివరీ బాయ్స్ ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు.పట్టణంలో పలు ప్రాంతాల్లో టీ,హోటల్,చిరు వ్యాపారస్తులను కదిలిస్తే మా అవసరం కాబట్టి ,2 వేలు పెట్టీ కొనుగోలుచేస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు.గ్యాస్ పైనే ఆధారపడి వ్యాపారాలు చేస్తున్నామని ధర ఎక్కువ అని కొనుగోలు చేయకపోతే వ్యాపారం మూతపడి పస్తులతో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందని,ఇప్పటికే సిగరెట్ ధరలు పెరగడంతో వ్యాపారాలు లేని పరిస్థితిలో గ్యాస్ ధరలు గుదిబండగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మామూళ్ల మత్తులో జోగకుండా పేద వారిని దృష్టిలో పెట్టుకొని అధికధరలకు గ్యాస్ విక్రయించకుండా చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయన ఎప్పుడూ ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు,కనీసం ఫోన్ లో అయినా రెస్పాన్స్ అవుతారంటే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయరని కొందరు వ్యాపారులు చెప్పడం విశేషం.సమస్య అధికారులకు కాకుండా ఎవరికి చెప్పాలో అర్థం కానీ పరిస్థితి.గ్యాస్ ధరలు ఇలానే ఉంటే మా వ్యాపారాలు మూసుకునే పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంటున్నారు.వ్యాపారుల కు గ్యాస్ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిద్దాం.
