నంద్యాలలో గంజాయి అక్రమ రవాణా భగ్నం

2 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు యువకులు అరెస్ట్

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 25:
ఆపరేషన్ “వజ్ర ప్రహార్”లో పోలీసుల కీలక విజయం…జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక దాడి.. ఎస్ డి పి ఓ పర్యవేక్షణలో ఆపరేషన్..
జగజ్జనని నగర్ చెరువుకట్ట వద్ద గుట్టుచప్పుడు కాకుండా దాడి..
దాసరి కళ్యాణ్ (22 సం”), మాందాపురం మనోహర్ (23 సం”) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన నంద్యాల 1వ పట్టణ పోలీసులు..వైజాగ్ సమీప అరకులో కిలో రూ 4,000 లకి గంజాయి కొనుగోలు చేసి,నంద్యాలలో 100 గ్రాముల ప్యాకెట్ రూ 2,000 లకి విక్రయం..కళాశాల విద్యార్థులే ప్రధాన టార్గెట్‌గా విక్రయాలు..10 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా తయారీ చేసి, చిల్లరగా అమ్మకం..నిందితుల్లో ఒకరికి గతంలో సారాయి కేసు నమోదైనట్లు సమాచారం..2 సెల్ ఫోన్లు స్వాధీనం – నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు ప్రారంభం..సరఫరా గొలుసు పై దృష్టి – అరకులోని మూలాలపై పోలీసుల దర్యాప్తు..గంజాయి విక్రయాన్ని అడ్డుకున్న 1- టౌన్ సిఐ జి.సుధాకర్ రెడ్డి బృందానికి జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ అభినందనలు..గంజాయి వినియోగం,నిల్వ,రవాణా,విక్రయం చట్ట విరుద్ధం..యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏ.ఎస్పీ జావళి ఆల్ఫోన్స్..అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి..సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపిన పోలీసులు.

Scroll to Top