•గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయం లోపల జరుగుతున్న వ్యవహారాలపై సంచలన ఆరోపణలు
•గత సబ్ రిజిస్ట్రార్ అధికారి ని తల దన్నెలా వసూళ్లు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 23:
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మరోసారి తీవ్ర వివాదాల తుఫాన్లో చిక్కుకుంది.కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలి ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ దారులు,స్థానిక వర్గాలు ఈ వ్యక్తిని నేరుగా “శకుని పాత్రధారి”గా అభివర్ణిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు..!!. మహాభారతంలో శకుని కౌరవ వర్గంలో ఉంటూ వాళ్ళతో మంచిగా ఉంటూ 100 మందిని ఎలా మట్టి కరిపించాడో అలాగే ఇక్కడ జరుగుతుంది. అధికారికి తెలియకుండా సీనియర్ అసిస్టెంట్ హోదాలో ఉన్న ఈ వ్యక్తే కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ వ్యవహారాల అసలు కేంద్రబిందువుగా మారాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక సబ్ రిజిస్ట్రార్‌ను పక్కనబెట్టి కీలక డాక్యుమెంట్లు ప్రాసెస్ అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి..!! ఈ అధికారి గతంలో పనిచేసిన ఓ రిజిస్ట్రార్ ని తలదాన్నెలా వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలు ప్రజల నుండి వెలువెత్తుతున్నాయి….చిన్న మొత్తాల డాక్యుమెంట్లను మాత్రమే అధికారికి చూపిస్తూ,పెద్ద మొత్తాలు వచ్చే లేదా వివాదాస్పదంగా ఉన్న రిజిస్ట్రేషన్లను ఇతర ప్రాంతాల కార్యాలయాల ద్వారా సెట్ చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇది కేవలం పరిపాలనా లోపమా..?? లేక పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవస్థాత్మక అవకతవకలా..??అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి..!!*
..“పైసలు ఇస్తే ఏ లిటికెంట్ స్థలం అయినా డాక్యుమెంట్ ఓకే” అవుతుందన్న అభిప్రాయం కార్యాలయం చుట్టూ బలంగా పాకింది.సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగత పనులపై వెళ్లిన సందర్భాల్లో ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టి,ఎలాంటి డాక్యుమెంట్ అయినా రిజిస్టర్ చేయడంలో దిట్టగా వ్యవహరిస్తున్నాడని రిజిస్ట్రేషన్ దారుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..!!
..కార్యాలయానికి కొత్తగా వచ్చే ప్రతి సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ సీనియర్ అసిస్టెంట్ ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నారనే చర్చ సిబ్బంది వర్గాల్లో నడుస్తోంది. అందుకే స్థానికులు ఈయనను “పెద్ద తిమింగలం”గా, “శకుని పాత్రధారి”గా పిలుస్తూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు..!!
..ఇటీవల వరుసగా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై వెలువడుతున్న వార్తల నేపథ్యంలో,ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ,రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలోనూ పారదర్శకత ఉందా..?? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.అధిక మొత్తాల లావాదేవీలపై ఉన్న ఆరోపణలు నిజమైతే,ఇది ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..!!
..నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ACB) పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన దర్యాప్తు లేదా చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో అనుమానాలకు దారితీస్తోంది.పెద్ద మొత్తాల లావాదేవీలపై ఆరోపణలు ఉన్నప్పటికీ ఏసీబీ స్పందన మందగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అధికార వర్గాలు సరైన ఆధారాలు లభించినప్పుడే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి…!!
..నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని రిజిస్ట్రేషన్ దారులు,ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..!!
..ఆరోపణలు నిజమా..?? కేవలం వర్గపోరాటాల ఫలితమా..?? అన్నది విచారణలో తేలాల్సి ఉంది..!!
..ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా..?? లేక “శకుని నీడ” అలాగే కొనసాగుతుందా..?? అన్నది వేచిచూడాల్సిందే..!!
