
- మున్సిపల్ కాంట్రాక్టర్ ల బకాయిలు చెల్లిస్తే పండుగ చేసుకుంటాం
- ఏడేళ్లు చేసిన 35 కోట్ల పనుల బకాయిలు చెల్లించండి
- కాంట్రాక్టర్లకు సీరియల్ ప్రకారం డబ్బులు చెల్లించండి
- నిధి పోర్టులో బిల్లులు ఎక్కించనీ అధికారులు
- బకాయిలు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,మంత్రి నారా లోకేష్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించండి. సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 8 :
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టర్ లు ముందుకువచ్చి సమస్యలు బహిర్గతం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.కాంట్రాక్టర్ల బకాయిలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సప్ కా ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు,మున్సిపాలిటీలో పనిచేసిన కాంట్రాక్టర్లు బకాయిలపై మీడియా సమావేశాలు నిర్వహించారు.ఈ నేపధ్యంలో నంద్యాల మున్సిపల్ కాంట్రాక్టర్లు శ్రీధర్ రెడ్డి,రామ సుబ్బారెడ్డి,సందీప్ నాయుడు,రఘునాథనాయుడు,రాజారెడ్డి,సత్యనారాయణ,నాగరాజు,వెంకటరామి రెడ్డి,వెంకటేశ్వర్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో పని చేసిన అందరూ కాంట్రాక్టర్లు దాదాపు 2019 నుంచి ఏడేళ్లుగా వివిధ పనులు చేశామన్నారు.పట్టణంలో వివిధ ప్రాంతాల్లో చేసిన పనులు దాదాపు 35 కోట్ల పనులు చేశామన్నారు.ఏడేళ్లుగా చేసిన పనులకు ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు.అప్పులు చేసి పనులు చేశామని వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో చేసిన పనులు సి.ఎఫ్.ఎంఎస్ లో నమోదుచేశారని ప్రస్తుత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసి నిధి పోర్టల్ లో ఎక్కించాలని ప్రభుత్వం చెప్పిందన్నారు.ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా నిధి పోర్టల్ లో అధికారులు ఎక్కించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.2017,2018 లో ఎస్సీ,ఎస్టీ సంబంధించిన బిల్లులు జనరల్ ఫండ్ లో నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు.సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కట్టిన స్టాంప్ డ్యూటీ దాదాపు 6 కోట్లు మున్సిపాలిటీకి రావాల్సి ఉందని,ఆ డబ్బు వస్తె ఇస్తామని అధికారులు చెబుతున్నారన్నారు.కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లు డిపాజిట్ డబ్బులు అప్పట్లో చెల్లించామని, కనీసం డిపాజిట్ డబ్బులైనా చెల్లించాలని అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.నంద్యాల మున్సిపాలిటీలో అత్యవసరంగా చేసిన పనులు సి బిల్లులు కూడా చెల్లించడం లేదని వాపోయారు.2019 నుంచి కొందరు కాంట్రాక్టర్లు మెయింటైన్ పనులు చేసిన వాటికి మోక్షం లేదన్నారు.నంద్యాల మున్సిపల్ పరిధిలో చేసిన పనులు మొత్తం అన్ని కలుపుకుంటే దాదాపు 35 నుంచి 38 కోట్లు బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లిస్తే సంక్రాంతి పండుగ జరుపుకుంటామని నాయకులు,అధికారులు కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని కోరారు.పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.విశేషం ఏమంటే మున్సిపల్ అధికారులు ముక్కు పిండి పన్నులు వసూళ్లు చేస్తున్నారు కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది మాత్రం గోప్యం.సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా డబ్బులు కాంట్రాక్టర్ల వి…గొప్పలు మాత్రం రాజకీయ నాయకు అడిచేసం,ఇది చేశాం అని చెప్పుకొని కాంట్రాక్టర్ల జీవితాలు నాశనం చేశారు.
