విద్యార్థులే దేశ భవిష్యత్తు – వారి భద్రతే మన లక్ష్యం – ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నందికొట్కూరు ప్రతినిధి / జనవరి 8 : నందికొట్కూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా, విద్యార్థి సంఘాలు, ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ “డ్రగ్స్ వద్దు” అనే సందేశంతో పాటు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలను విద్యార్థులకు వివరించడం జరిగింది.
విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకునే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించాం.
డ్రగ్స్‌ రహిత సమాజం దిశగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరం. విద్యార్థులే దేశ భవిష్యత్తు – వారి భద్రతే మన లక్ష్యం.

Scroll to Top