నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఘనంగా ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం

ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 07:
నంద్యాల పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ పథకంలో భాగంగా “పంజాబీ భాషా అభ్యాస కార్యక్రమం” శనివారం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సారూప్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు. 
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, విద్యార్థులు ఇతర రాష్ట్రాల భాషలను, సంస్కృతులను నేర్చుకోవడం ద్వారా జాతీయ సమైక్యత బలపడుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ – పంజాబ్ రాష్ట్రాల మధ్య సోదరభావాన్ని పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. పంజాబీ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శించిన చిత్రపటాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Scroll to Top