రంజాన్ మాసం సోదరభావానికి ప్రతీక – ఎన్ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 07:
రంజాన్ మాసం అంటేనే దానధర్మాలు, క్రమశిక్షణ మరియు సోదరభావానికి ప్రతీక అని, ఉపవాస దీక్షలో ఉన్నవారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యకార్యమని టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకు శనివారం నాడు నంద్యాల పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మస్జీద్ -ఎ – ఖురైష్ లో ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఎన్ఎండి ఫయాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అలాగే నంద్యాలలోని పలు మసీదులలో ముస్లిం సోదరుల కోసం ‘దావత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సమానత్వం నెలకొల్పడానికి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని, నంద్యాల మరియు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మసీదుల వద్ద ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో పట్టణంలోని మస్జీద్ ఏ కుబ్రా (సాయిబాబా నగర్), మస్జీద్ ఏ జమీల్ (బీసీ హాస్టల్, దేవా నగర్), మస్జీద్ ఏ మోమిన్ (దేవా నగర్ పార్క్), మస్జీద్ ఏ ఇనాముల్ హసన్ (దేవా నగర్), మస్జీద్ ఏ నూరాని (దేవా నగర్), మస్జీద్ ఏ అబూబకర్ (బీసీ కాలనీ), మస్జీద్ ఏ అక్సా (శ్యామ్ నగర్) మరియు పలు మసీదులలో ఇఫ్తార్ విందును మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఫయాజ్ తెలిపారు
ఈ కార్యక్రమంలో నంద్యాల హరుణ్ టాటా మోటార్స్ షోరూం అధినేత ముస్తాక్, నంద్యాల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా సిద్దికి , మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న ఉసేని, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Scroll to Top