నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శెట్టిబళిజ సామాజిక సంస్థ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి వేడుకలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 23 :

శెట్టిబళిజ సామాజిక సంస్థ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి వేడుకలు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ప్రముఖ సంఘసంస్కర్త మరియు శెట్టిబళిజ సామాజిక సంస్థ వ్యవస్థాపకుడైన దొమ్మేటి వెంకట రెడ్డి 1853 మార్చి 23న ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ ప్రాంతంలో జన్మించారు. దొమ్మేటి వెంకట రెడ్డి తన జీవితాన్ని విద్య మరియు అభ్యున్నతికి అంకితం చేసిన ప్రముఖ సంఘసంస్కర్త.   1853 మార్చి 23 న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దొమ్మేటి వెంకటరెడ్డి.18వ శతాబ్దంలో భారతదేశంలో  పేదరికం, ఆకలి భాదలతో ప్రజలు నిత్యం తల్లడిల్లేవారు. శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు.  బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి సేవలను ఈ సందర్భంగా  స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ తో పాటు  సాయుధ బలగాల డిఎస్పి శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బాబు, మంజునాథ్, సురేష్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top