నంద్యాల ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫేర్ వెల్ డే

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 14 :

నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల నందు శనివారం విద్యార్థుల వీడ్కోలు వేడుకలు (ఫేర్ వెల్ డే) అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆశీస్సులతో కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఉర్దూ కళాశాల ప్రిన్సిపల్ కరిముల్లా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, ఉర్దూ డిఐ అస్ముద్దీన్, డీఐఈఓ సుబ్బారావు , బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖరప్ప, టీడీపీ నాయకులు ఎబినేజర్, నాగేశ్వరరావు, సాయిరాం, అక్బర్, సైలాబ్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top