అండర్ 9,అండర్ 7 కేటగిరిలలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు


సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 14 :
నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ లో ఏడు సంవత్సరాల లోపు మరియు తొమ్మిది సంవత్సరాల లోపు క్రీడాకారులకు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో విజేతలకు నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జి.రవికృష్ణ, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి రామ సుబ్బారెడ్డి విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు ఈ సంవత్సరం జరగబోయే రాష్ట్రస్థాయి 7 సంవత్సరాల లోపు,9 సంవత్సరాల లోపు పోటీలలో జిల్లా జట్టు తరపున పాల్గొంటారని డాక్టర్ రవికృష్ణ, రామసుబ్బారెడ్డి తెలిపారు. చిన్న వయసులోనే చదరంగం నేర్చుకుని పోటీలలో పాల్గొనడం ద్వారా, వారి ఆసక్తిని,సాధన బట్టి త్వరిత గతిన రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
విజేతల వివరాలు:
అండర్ 7 బాలుర విభాగంలో మొదటి స్థానం తనీష్,రెండవ స్థానం వశిష్ట సాధించగా,అండర్ 9 బాలుర విభాగంలో మొదటి స్థానం వాసుదేవ్ వల్లభ,రెండవ స్థానం అచ్యుతానంద సాయి విజేతలుగా నిలిచారు.
అండర్ 9 బాలికల విభాగంలో మొదటి స్థానం లక్ష్మీ గీతిక,రెండవ స్థానం మోక్షిత, మూడవ స్థానం గగనశ్రీ విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.
తదుపరి స్థానాలు సాధించి పతకాలు అందుకున్న వారు:
మయాంక్ యాదవ్ , సుప్ర దీస్, ధనుష్ రాయల్, నరసింహారెడ్డి,తనీష్,శశాంక్, నాగచైతన్య,సరోజ్,ఆయాన్.
