మహిళల భద్రత అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టండి
రౌడీ షీటర్లు మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోండి
శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా విధులు నిర్వహించండి



సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 24 :
నంద్యాల జిల్లాలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ జిల్లా పోలీసు అదికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి సమీక్షా నిర్వహించడం జరిగింది. పోలీస్ స్టేషన్ల వారీగా యు.ఐ. కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగింది.
గ్రామ / వార్డులలో మహిళలలో ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళల భద్రతపై అధిక ప్రాధాన్యతనిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టండి.
శాంతి భద్రతల పరిరక్షణలో రాజి లేకుండా విధులు నిర్వహిస్తూ చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచండి రౌడీషీటర్లు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. రికవరీ అయిన సెల్ఫోన్లని ప్రతినెల మొదటిరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి బాధితులకు నేరుగా అందించండి.
రాబోయే లోక్ అదాలత్ సందర్భంగా కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
నేర నియంత్రణలో బీట్లు, పికెట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న ఎన్.బి.డబ్ల్యు ల పై ప్రత్యేక శ్రద్ధ ఉంచి పరిష్కార దిశగా చర్యలు తీసుకోండి.
కాలేజీలు ,వసతి గృహాలు మరియు ప్రార్థన ఆలయాలు చర్చి ,మసీదు ,దేవాలయ పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఎ.ఎస్.పి. ఎం .జావళి, రామంజి నాయక్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
