

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 24 :
నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్కూలు మరియు కాలేజీలలో మహిళా భద్రత, సైబర్ క్రైమ్, మరియు శక్తి యాప్ లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ ఆదేశాలమేరకు నంద్యాల డిస్టిక్ శక్తి టీం బృందం, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మరియు డిస్టిక్ ఈగల్ టీం సిబ్బందితో కలిసి పాణ్యం మండలం కొనిదేడు గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గల విద్యార్థినిలకు శక్తి యాప్ వలన కలిగే ప్రయోజనాల గురించి,సైబర్ క్రైమ్ నేరాలు, బాల్యవివాహాలు ,చైల్డ్ వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ మొదలగు వాటి గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది.
వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ మహిళలపై జరిగే అఘాయిత్యాలు, మహిళల భద్రత గురించి మరియు వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి లైంగిక వేధింపుల గురించి వివరించి అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈగల్ టీం సిబ్బంది మాట్లాడుతూ చెడు అలవాట్లకు,మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని ఉన్నత చదువులు చదువుకొని మీ కుటుంబ సభ్యులకు గురువులకు మంచి పేరు తీసుకుని రావాలని పలు సూచనలు చేయడం జరిగింది.
