
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 22:
ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్మిస్తున్న అతిథి వసతి గృహానికి భక్తులు రూ.2,00,116 విరాళం సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు.
నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీకి చెందిన ఆర్వేటి నాగయ్య శెట్టి కుటుంబ సభ్యులు స్వామివారిపై భక్తి భావంతో మొక్కుబడిగా ఈ విరాళాన్ని అందజేశారు. డాక్టర్ సాయి దినేష్, డాక్టర్ పవిత్ర దంపతులు స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి ఈ సహాయాన్ని సమర్పించినట్లు తెలిపారు.
దాతల కుటుంబానికి ఆలయ మర్యాదలతో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాలు, పూలమాలలతో సత్కరించి ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, నారాయణ శర్మ, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
