శ్రీ సంకల్ప్ పాఠశాలలో ఘనంగా జరిగిన వార్షిక క్రీడా దినోత్సవం- బ్లేజింగ్ రాకెట్స్-2026

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 22:
నేటి బాలలు క్రీడలతో జీవిత సత్యాలు తెలుసుకుంటారు తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ .ఎం.డి.ఫిరోజ్ పేర్కొన్నారు.  నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో శ్రీ సంకల్ప్ పాఠశాలలో వార్షిక క్రీడా దినోత్సవం – బ్లేజింగ్ రాకెట్స్-2026కు సంబంధించి కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా జనరల్ సెక్రటరీ ఆఫ్ టి.డి.పి ఎన్.ఎం.డి ఫిరోజ్ ,శ్రీ సంకల్ప్ విద్యాసంస్థల అధినేత సుధాకర్ ,వారి సతీమణి రమ్యా రెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ దివ్యకోషి , పాఠశాల బోధన,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి సాదర సత్కారం అనంతరం వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, శారీరక మానసిక దృఢత్వాన్ని చేకూర్చే లక్ష్యంతో ఈ క్రీడా వేడుకలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. క్రీడలు విద్యతోపాటు విద్యార్థుల 
సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని పాఠశాల చైర్మన్ సుధాకర్ సందేశం ఇచ్చారు. 
క్రీడోత్సవం ప్రారంభంలో భాగంగా విద్యార్థులు ఆకర్షణీయమైన మార్చ్ ఫాస్ట్, స్కేటింగ్, డ్రమ్స్ వాయిద్యాలతో చూపరుల దృష్టిని ఆకర్షించారు. స్వాగత నృత్యం, క్రీడా నృత్యం, మ్యూజిక్, చీరా డ్యాన్స్, హవాలా హోప్ డాన్స్ లు అందరినీ అలరించాయి. కరాటే, యోగా, ఎరోబిక్స్, ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రాంగణమంతా క్రీడా వస్తువుల చిత్రాలతో, ప్రపంచ ప్రసిద్ధికెక్కిన క్రీడాకారుల చిత్రాలతో, అందమైన క్రీడా రంగవల్లులతో శోభాయమానంగా కనువిందు చేసింది. తదనంతరం విద్యార్థుల విభాగాల వారీగా వివిధ రకాల క్రీడా పోటీలు కబడ్డీ, కోకో, వాలీబాల్, బాస్కెట్ బాల్, లాంగ్ జంప్, హై జంప్ లతో పాటు వివిధ రకాల వినోద క్రీడలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పోటా పోటీగా రాణించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ నేటి బాలలు క్రీడల ద్వారా ఎన్నో జీవిత సత్యాలను తెలుసుకుంటారని, గెలుపు కోసం శ్రమించడం,ఓటమిని అంగీకరించడం వంటి జీవిత పాఠాలను విద్యార్థి గ్రహిస్తాడని ప్రబోధించారు.  ప్రీ ప్రైమరీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మధ్య విభిన్న క్రీడా పోటీలను నిర్వహించటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రీడోత్సవం రెండు రోజులపాటు కొనసాగుతుందని అనగా 22/02/26న ప్రారంభమైప్రారంభమై 23/02/26న ముగుస్తుందని, క్రీడాపోటీలలో విజేతలైన ప్రతి ఒక్కరికీ బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని పాఠశాల యాజమాన్యం వారు తెలిపారు.

Scroll to Top