



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06 :
బండిఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామం నందు ఈస్టర్ పండుగ సందర్భంగా నిర్వహించిన ఎద్దులు బండ లాగుడు పోటీలను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు,యువ న్యాయవాది తాతిరెడ్డి మనీష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ ఎద్దుల జట్టు యజమానులకు అభినందనలు తెలియచేస్తూ రిబ్బన్ కట్ చేసి ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది అని ఆయన అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆయనను సగౌరవంగా ఆహ్వానించినదుకు కడమల కాల్వ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టానికులు భూపాల్, ఎద్దుల సుబ్బరాయుడు,పబ్బతి రాజేష్,పబ్బతి మోహన్,కొప్పుల భాస్కర్,పబ్బతి రంగస్వామి,వెంకటయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
