అంతర్జాతీయ వేదికఫై మరో మారు అడుగుపెట్టనున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 25:
భారతదేశం – జర్మనీ దేశం పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి నియమితులయ్యారు.
దీంతో అంతర్జాతీయ వేదికఫై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మరో మారు అడుగుపెట్టనున్నారు.
ఈ సందర్బంగా బుధవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికపై దేశ సేవ చేసే ఈ గొప్ప అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని. భారతదేశం –జర్మనీ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో, రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సార్థకమైన పార్లమెంటరీ సహకారం అందించడంలో నేను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆమె చెప్పారు. భారతదేశం పక్షాన జర్మనీ దేశం టూర్ కు తనను ఎంపిక చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారత పార్లమెంట్ లోక్ సభ స్వీకర్ ఓం ప్రకాష్ బిర్లా, ప్రోత్సహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.

Scroll to Top