కొత్తపల్లెలో సిసి రోడ్లను పరిశీలించిన టిడిపి నేత తులసిరెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 25:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏపి స్టేట్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఎన్. కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న సిసి రోడ్లను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటివల గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పారు. ఫలితంగా ఎన్, కొత్తపల్లె గ్రామంలో పలు చోట్ల సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్టు తులసి రెడ్డి చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ముఖ్యంగా నిరుపెదల్ల్లో అర్హులవారికి ప్రభుత్వ పెన్షన్లు, సంక్షేమ పధకాలు అందుతున్నాయని అయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏపి స్టేట్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి పేర్కొన్నారు.

Scroll to Top