AISF నంద్యాల జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఉద్యమాలు బాట పట్టాలి

AISF మాజీ నాయకులు

సత్యం వార్త / నంద్యాల / జనవరి 13 :
స్థానిక నంద్యాల పట్టణంలోని CPI కార్యాలయంలో AISF 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణను AISF మాజీ జాతీయ నాయకులు రామాంజనేయులు, AISF మాజీ జాతీయ అధ్యక్షులు మురళీధర్ ,AISF మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగనాయుడు చేతుల మీద ఆవిష్కరించడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో AISF నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్రి స్వామి, సూర్య ప్రతాప్ , మాజీ నాయకులు భార్గవ్, AISF జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి,AISF నాయకులు మాబాష, మతేష్, తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర AISF కి ఉంది అని, చదువు పోరాడు అన నిదానంతో దశాబ్దాలు పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పోయిన నిరంతరం పోరాడుతు ఎన్నో త్యాగాలకు మారుపేరుగా ఉన్న విద్యార్థి సంఘం AISF అని నేటి పాలకులు విద్య వ్యవస్థను నాశనం చేస్తుందని కావున విద్యారంగా పరిరక్షణకై విద్యార్థులు పోరుబాటు పట్టాలని వారు పిలుపునిచ్చారు, ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నికలు వచ్చినా హామీలను చేయాలని PPP నిదానంగా రద్దు చేయాలని, పెండింగ్లో ఉండే 6400 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Scroll to Top