జంబియా జాతీయ అసెంబ్లీ స్వీకర్ నెల్లీ బుటేట్ కషుంబా ముట్టిని, ఆమె బృందనికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఘన స్వాగతం

సత్యం వార్త / జనవరి 13 :
న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన జాంబియా జాతీయ అసెంబ్లీ స్పీకర్ నెల్లీ బుటేట్ కషుంబా ముట్టిని, ఆమె ప్రతినిధి బృందాన్ని మంగళవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి హృదయపూర్వకంగా ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఢిల్లీలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, కామన్వెల్త్ శాసనసభల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, పాలన, శాసన విధానాలలో ఉత్తమ పద్ధతులను పంచుకోవడం లక్ష్యంగా ఉన్న ఒక ముఖ్యమైన వేదిక అయిన కామన్వెల్త్ స్పీకర్లు, అధ్యక్షత వహించే అధికారుల 28వ సమావేశంలో పాల్గొనడానికి ప్రతినిధి బృందం భారతదేశాన్ని సందర్శిస్తోందని, అందులో భాగంగా ఢిల్లీకి వచ్చిన జాంబియా జాతీయ అసెంబ్లీ స్వీకర్ నెల్లీ బుటేట్ కషుంబా ముట్టిని, వారి ప్రతినిధుల బృందాన్ని భారత దేశం తరుపున తాను స్వాగతం పలికినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.

Scroll to Top