
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 6 : రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ట్రాన్స్ పోర్టు సేవలన్నీ ఆన్లైన్ లో ఉన్నాయని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు తమ స్వార్థం కోసం ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, లైసెన్స్ రెన్యువల్ తదితర అంశాలపై మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. కొందరు దళారులను నమ్మి మోసపోతున్నారని, సేవలన్నీ పారదర్శకంగా ఆన్లైన్ లో ఉన్నాయని ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యంగా ఆటో నగర్ లో కొందరు దళారులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అలాంటి వారి పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యాలయంలో ఏజెంట్లు ఉండరని, నేరుగా అన్ని సేవలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.
