ఘనంగా ఎంపీ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలు

 

సత్యం వార్త/ నంద్యాల /జనవరి 4 :

  నంద్యాల పట్టణంలోని స్థానిక జగజ్జనని నగర్ ఆరవ వార్డులో ఉన్న డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ  కార్యాలయం దగ్గర హ్యూమన్ రైట్స్ మహిళా  అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వహీదా ఆధ్వర్యంలో, ఆమె సహకారంతో  దివ్యాంగుల మధ్య కేకు కటింగ్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సేఫ్టీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాథరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పర్లా దస్తగిరి హాజరయ్యారు. అనంతరం నరహరి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ… నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కి దివ్యాంగులు సహాయం చేయడం అంటే చాలా ఇష్టమని, దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే సంక్షేమ పథకాలను  దివ్యాంగులకు అందేలా చూస్తామని, ఎంపీ బైరెడ్డి శబరి సహకారంతో దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. రెడ్ క్రాస్ సొసైటీ  చైర్మన్ పర్లా దస్తగిరి మాట్లాడుతూ ఎంపీ బైరెడ్డి శబరి కేంద్రం నుండి రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు వచ్చేలా కృషిచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. టిడిపి మహిళా నాయకురాలు వహీదా మేడం మాట్లాడుతూ… దివ్యాంగులకు ఎంపీ బైరెడ్డి శబరి  ఎంపీ నిధుల నుండి బ్యాటరీట్రై సైకిల్స్, వయోవృద్ధులకు వీల్ చైర్స్ వాకర్సు, దివ్యాంగుల  సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం దివ్యాంగులకు రంజాన్ తోఫా తో పాటు, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ రోజున కూడా దివ్యాంగులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు దివ్యాంగులకు చేస్తానని అన్నారు. అనంతరం 50 మంది నిరుపేద దివ్యాంగులకు నిత్యవసర సరుకులతో పాటు అన్నవితరణ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్లయ్య, డిజేబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యదర్శి జహీరుద్దీన్, సభ్యులు బాల తిమ్మయ్య, అబ్దుల్ హమీద్, వినోద్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top