
వికలాంగుల సేవా కార్యక్రమాలకు పబ్బతి వేణుగోపాల్ ఆర్థిక సహాయం- బాల సుబ్బయ్య
సత్యం వార్త / నంద్యాల / జనవరి 4 : రాయలసీమ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో, పిఏవి గ్రూప్ చైర్మన్ ఆర్యవైశ్య నాయకులు పబ్బతి వేణుగోపాల్ ఆర్థిక సహాయంతో ఆదివారం స్థానిక పిఏవి కార్యాలయం వద్ద దివ్యాంగులకు ట్రై సైకిళ్లు ,దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పబ్బతి వేణుగోపాల్ మాట్లాడుతూ పి ఏవి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ట్రై సైకిల్లు దుస్తులు పంపిణీ చేశామన్నారు.రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షులు న్యాయవాది బాలసుబ్బయ్య మాట్లాడుతూ ఎన్నో సంవత్సరంలుగా పిఏవి గ్రూపు చైర్మన్ పబ్బతి వేణుగోపాల్ వికలాంగుల సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు
