




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 05 :
విద్యారంగం మరియు సేవా కార్యక్రమాల్లో అంజద్ భాష అందించిన సేవలు ఎంతో అభినందనీయమని, అవి చిరస్మరణీయంగా నిలిచిపోతాయని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఉర్దూ ఉపాధ్యాయునిగా సుదీర్ఘ కాలం సేవలు అందించి పదవీ విరమణ చేసిన అంజద్ భాష సిద్ధికిని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక కుబ్రా మసీదులో ఏర్పాటు చేసిన ఈ సన్మాన సభకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై, అంజద్ భాషను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు నంద్యాల జిల్లాలోని ఇమాముల సంక్షేమానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇమాముల సంఘం సభ్యులకు టిట్కో గృహాలను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. పదవీ విరమణ అనంతరం కూడా అంజద్ భాష తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరింపజేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్, అంజుమన్ సంస్థ అధ్యక్షులు ఎన్ఎండి కుదుసు, నంద్యాల ఐ.ఎమ్.ఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, టూ టౌన్ సీఐ అస్రార్ భాష మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ బార అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ భాష , నంద్యాల జమాతే ఇస్లాం అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ ఆన్సర్ జ్యువెలర్స్ అధినేత ఆన్సర్ మరియు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నాయకులు మౌలానా మహబూబ్ బాషా , హాఫిజ్ అబ్దుల్ సలాం , హాఫిజ్ అబ్దుల్ రెహమాన్ , హాఫిజ్ రజాక్ , హాఫిజ్ అమీర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. వక్తలు అందరూ అంజద్ భాష విద్య మరియు వైద్య సేవా రంగాలలో చేసిన కృషిని కొనియాడారు.
