

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 05 :
నంద్యాల పట్టణంలో స్థానిక విశాల్ మార్ట్ పైన ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ వైభవం ఫంక్షన్ హాల్లో ఆదివారం విక్రమ్ సింగ్ మరియు రేఖా కున్వర్ ల వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రాజపురోహిత్ బాబు సింగ్ (శ్రీ ఆశాపురి ఎంటర్ప్రైజెస్) కుటుంబం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నూతన జంట నిండు నూరేళ్లూ సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వధూవరుల కుటుంబ సభ్యులు మంత్రి ఫరూక్ కి సాదర స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వేడుకలో రాజపురోహిత్ కుటుంబ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, బంధుమిత్రులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
